ఇది ‘అఖండ’ విజయం.. చిరంజీవి రికార్డును బద్దలుకొట్టిన బాలకృష్ణ.. - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Tuesday, April 20, 2021

ఇది ‘అఖండ’ విజయం.. చిరంజీవి రికార్డును బద్దలుకొట్టిన బాలకృష్ణ..

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే.. ఆ థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొనేది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి మధ్య స్నేహపూర్వకమైన కాంపిటీషన్ ఉండేది. చాలా సందర్భాల్లో వీరిద్దరి సినిమాలు ఏకకాలంలో విడుదలయ్యాయి. అందులో కొన్ని హిట్లు చిరంజీవి అందుకోగా.. ఇంకొన్ని హిట్లు బాలయ్య అకౌంట్‌లోకి వెళ్లాయి. చిరంజీవి రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం.150’ విడుదల అయిన సమయంలోనే బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా హిట్లుగా నిలిచాయి. అయితే మరోసారి చిరు, బాలకృష్ణ మధ్య పోటీ నెలకొంది. అయితే ఈసారి వెండితెరపై కాదు.. యూట్యూబ్‌లో. మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘’. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడమే కాక.. ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఇక బాలకృష్ణ.. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం ‘’. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా టైటిల్‌ని ప్రకటిస్తూ.. ఓ టీజర్‌ని వదిలారు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కోస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలకృష్ణ చెప్పిన ఒకేఒక్క డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసిన ట్రెండింగ్ అవుతోంది. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు.. ఆఘోరీ రూపంలో బాలకృష్ణ లుక్స్‌తో సోషల్‌మీడియా మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇంకేముంది ఈ టీజర్ ప్రస్తుతం రికార్డులు తిరగరాస్తోంది. టీజర్ విడుదలైన 25 గంటల్లో 12 మిలియన్ల వ్యూస్‌రాగా.. ఆరు రోజుల్లోనే ఈ టీజర్ 28 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ‘అఖండ’ చిరంజీవి ‘ఆచార్య’ రికార్డును బద్దలుకొట్టింది. రెండు నెలల క్రితం విడుదలైన చిరంజీవి ‘ఆచార్య’ టీజర్ ఇప్పటివరకూ 19 మిలియన్ వ్యూస్ మాత్రమే సాధించింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మోషన్ పోస్టర్‌కి 7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. మొత్తానికి ప్రస్తుతం ఉన్న బడా సినిమా రికార్టులను ఒక్క టీజర్‌‌తో బద్దలుకొట్టాడు బాలయ్య. దీంతో ఇది ‘అఖండ’ విజయమే అని బాలకృష్ణ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3goMiFD

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages