యమ స్టైలిష్ లుక్‌లో నాగశౌర్య.. 'వరుడు కావలెను' టీమ్ సర్‌ప్రైజింగ్ వీడియో - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Friday, January 22, 2021

యమ స్టైలిష్ లుక్‌లో నాగశౌర్య.. 'వరుడు కావలెను' టీమ్ సర్‌ప్రైజింగ్ వీడియో

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై , రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ''. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై విలక్షణ కథలను ఓకే చేస్తూ దూసుకుపోతున్న ఆయన నేడు (జనవరి 22) తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్‌ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేసింది 'వరుడు కావలెను' టీమ్. ఈ వీడియోలో హీరో నాగశౌర్య లుక్‌ను హైలైట్ చేసి చూపించారు. సిక్స్ ప్యాక్ బాడీపై షర్ట్, దానికి సరిపోయే బ్లేజర్, మేచింగ్ వాచ్, కళ్లజోడు ధరించి యమ స్టైలిష్ లుక్‌లో కనిపించారు నాగశౌర్య. మొత్తంగా స్టైలిష్ లుక్‌తో నడుచుకుంటూ వస్తున్న నాగశౌర్యను పరిచయం చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీలో ముర‌ళీ శ‌ర్మ‌, న‌దియా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీతో పాటు సంతోష్‌ జాగర్లపూడి ద‌ర్శ‌కత్వంలో 'ల‌క్ష్య' అనే సినిమా చేస్తున్నాడు నాగశౌర్య. కేతికశర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి నారాయణదాస్‌ కె నారంగ్‌, రామ్మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు కేపీ రాజేంద్ర దర్శకత్వంలో ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య‌. మహేష్‌.ఎస్‌.కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించే సినిమాల నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్స్ ఇచ్చి ఆయన అభిమానులను ఫిదా చేశారు దర్శకనిర్మాతలు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Y2Q4u7

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages