
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న సీపీగెట్ (సీపీజీఈటీ)– 2020 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదాపడింది. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్ల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. అయితే షెడ్యూల్ ప్రకారం వెబ్‌ఆప్షన్లు ఈనెల 22 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల దానిని వాయిదావేశారు. ఈనేపథ్యంలో ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్, ధ్రువపత్రాల అప్‌లోడింగ్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకునే గడువును పొడిగించారు. ఈ నెల 27వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు. ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల:ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంసీఏ (సీబీసీఎస్) రెండో, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలు లో అందుబాటులో ఉన్నాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.
from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/2Nzj7n6
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.