భారత్‌లో లాక్‌డౌన్‌‌తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే.. ధనవంతుల ఆదాయం ఎంత పెరిగిందంటే?: ఆక్స్‌ఫామ్ సంచలన నివేదిక - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Monday, January 25, 2021

భారత్‌లో లాక్‌డౌన్‌‌తో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే.. ధనవంతుల ఆదాయం ఎంత పెరిగిందంటే?: ఆక్స్‌ఫామ్ సంచలన నివేదిక

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆదాయ అసమానతలు మరింత దిగజారాయా? పేదలు కటిక దరిద్రంలోకి... ధనవంతులు సంపద రెట్టింపయ్యిందా? అంటే అవునంటోది ఆక్స్‌ఫామ్ నివేదిక. ‘కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంలోని ధనవంతులు, కోట్లాది మంది నైపుణ్యం లేని కార్మికుల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను మరింత దిగజార్చింది.. వీరిలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యాన్ని పొందటానికి కష్టపడుతున్నారు’ అని పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఈ నివేదికను సోమవారం ప్రవేశపెట్టారు. ‘వైరస్ అసమానత’పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. లాక్‌డౌన్ వేళ భారత్‌లో బిలీనియర్ల సంఖ్య 35 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. ఇదే సమయంలో 84 శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని, ఒక్క ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొంది. మార్చి 2020 నుంచి దేశంలోని టాప్ 100 బిలీనియర్ల ఆదాయం పెరిగిందని.. వీరి ఆదాయం 138 మిలియన్ల పేదలకు ఒక్కొక్కరికి రూ.94,045 చొప్పున ఇవ్వడానికి సరిపోతుందని తెలిపింది. ‘దేశంలో పెరుగుతున్న అసమానత తీవ్రమైంది... మహమ్మారి సమయంలో ఒక గంటలో అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్)కి లభించిన ఆదాయం నైపుణ్యం లేని కార్మికుడి సంపాదించాలంటే 10,000 ఏళ్లు పడుతుంది..వారు మూడేళ్లలో సాధించేంది అంబానీ ఒక సెకెండులో పొందారు’ అని వ్యాఖ్యానించింది. గతేడాది ఆగస్టు నాటికి భూ గ్రహంపై అత్యంత ధనవంతులైన వ్యక్తుల్లో అంబానీ నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోనే కఠినమైన లాక్‌డౌన్ అమలు చేసిన తర్వాత లక్షలాది మంది వలస కార్మికులు ఉద్యోగాలు, ఆదాయం, ఆహారం, ఆశ్రయం లేకుండా మిగిలిపోయారు. వందలాది కిలోమీటర్ల దూరంలోని తమ స్వస్థలాలకు కాలినడక వెళుతూ వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వారి దీనవాస్థను చూసి కన్నీరుపెట్టనవారు లేరు. అయితే, ఎంత మంది వలస కార్మికులు చనిపోయారో తమ వద్ద డేటా లేదంటూ పార్లమెంట్‌లో ప్రభుత్వం ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజీపై కూడా ఆక్స్‌ఫామ్ ప్రస్తావించింది. ‘ప్యాకేజీ ప్రత్యక్ష ఆర్థిక ప్రభావం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ పెంచడం, ప్రైవేటు రంగానికి అంతరిక్ష పరిశోధనలను తెరవడం వంటివి సహా రూ.2 లక్షల కోట్ల కొంచెం ఎక్కువ.. లేదా జీడీపీలో ఒక శాతం’ అని వ్యాఖ్యానించింది. భారతదేశంలోని టాప్ 11 బిలియనీర్లకు మహమ్మారి సమయంలో పెరిగిన సంపదపై కేవలం ఒక శాతం మాత్రమే పన్ను విధించినట్లయితే అది జన్ ఔషధి పథకానికి కేటాయింపులను పెంచుతుంది.. ఇది నాణ్యమైన ఔషధాలను 140 రెట్లు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతుంది అని పేర్కొంది. ఆరోగ్య సంరక్షణలో అసమానతలను కూడా నివేదిక ఎత్తి చూపింది. భౌతికదూరం, చేతులు కడుక్కోవడం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ పట్టణ ప్రాంతాల్లో ఒకే గది, రెండు గదుల ఇళ్లలో నివసిస్తున్నవారు వరుసగా 32 శాతం, 30 శాతం గృహాలు ఉన్నాయని తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగానూ సంపదలో అసమానతలు ఇదే విధంగా ఉన్నాయని పేర్కొంది. ‘గతేడాది మార్చి 18 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రపంచవ్యాప్తంగా బిలినియర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్లుకు చేరింది.. ఇదే సమయంలో పేదరికంలో నివసించే ప్రజల సంఖ్య 200 మిలియన్ల నుంచి 500 మిలియన్లకు పెరగింది’ అని వివరించింది. ఈ అసమానతలను తగ్గించడానికి భారత ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కొన్ని సూచనలు చేసింది. రూ.50 లక్షలకుపైగా సంపాదించే వారిపై రెండు శాతం సర్‌చార్జి విధించాలని, మహమ్మారి సమయంలో లాభాలు ఆర్జించే సంస్థలపై తాత్కాలిక పన్నును ప్రవేశపెట్టాలని కోరింది. ‘మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి భారత ప్రభుత్వం నిర్దిష్ట మరియు దృఢమైన చర్యలు తీసుకోవలసిన సమయం ఇది ... ప్రజల గళాలు మరింత సమానమైన, న్యాయమైన భవిష్యత్తును కోరుకుంటాయి’ అని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3phgSTt

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages