లోన్ కోసం బ్యాంకు మేనేజర్ దగ్గరకెళ్లిన టీనేజర్.. సమాజం తలదించుకునే ఘటన! - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Monday, January 25, 2021

లోన్ కోసం బ్యాంకు మేనేజర్ దగ్గరకెళ్లిన టీనేజర్.. సమాజం తలదించుకునే ఘటన!

ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తానని మాటిచ్చిన ఓ బ్యాంకు మేనేజర్.. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాలికతో సన్నిహితంగా గడిపిన దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ టీనేజర్.. ఆత్మహత్యకు యత్నించే క్రమంలో.. టీచర్‌ దగ్గర తన గోడును వెళ్లబోసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. సమత (పేరు మార్చాం) అనే టీనేజర్‌ స్నేహితురాలు బ్యాంకు మేనేజర్ ఇంట్లో పని చేసేది. 2019లో తాను బ్యాంకు మేనేజర్‌ను కలిస్తే లోన్ ఇప్పించాడని చెప్పింది. దీంతో ఉన్నత చదువులు చదవాలని భావిస్తోన్న సమత.. తనకు కూడా బ్యాంకు మేనేజర్‌ను పరిచయం చేయాలని తన స్నేహితురాల్ని కోరింది. స్నేహితురాలి సాయంతో బ్యాంక్ మేనేజర్‌ను కలిసిన సమత.. తనకు లోన్ కావాలని రిక్వెస్ట్ చేసింది. తర్వాత సమతతో చాటింగ్ ప్రారంభించిన మేనేజర్... మెల్లగా షాపింగ్‌కు తీసుకెళ్లాడు. 2020 ఆగస్టులో సమతను హోటల్‌కు తీసుకెళ్లిన బ్యాంకు మేనేజర్ రేప్ చేసి వీడియో తీశాడు. ఆ వీడియోతో బెదిరించి.. ఓసారి గోవా తీసుకెళ్లి మూడు రోజులపాటు తన కోరిక తీర్చుకున్నాడు. తాను చనిపోవాలని అనుకుంటున్నానని కొద్ది రోజుల క్రితం సమత తన టీచర్‌కు మెసేజ్ పెట్టింది. వెంటనే అప్రమత్తమైన టీచర్.. సమత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఆత్మహత్య చేసుకోకుండా చూశారు. తర్వాత సమతకు కౌన్సెలింగ్ ఇచ్చి.. తుకోగంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. టీనేజర్‌పై లైంగిక దాడికి పాల్పడిన బ్యాంకు మేనేజర్‌ను పర్విందర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. ఇండోర్‌లోని ఓ జాతీయ బ్యాంకులో మూడేళ్లపాటు పని చేసిన పర్వీందర్ మొహాలీకి బదిలీ అయ్యారు. దీంతో అతణ్ని అతణ్ని రప్పించడం కోసం సమతతో ఫోన్ చేయించారు. ఆదివారం చేరుకోగానే ఎయిర్‌పోర్టులోనే మెనేజర్‌ను అరెస్ట్ చేశారు. సమత స్నేహితురాల్ని పోలీసులు సహ నిందితురాలిగా చేర్చి.. జువైనల్ హోంకు రిమాండ్‌కు పంపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3iHe0N0

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages