
మెగా డాటర్ పెళ్లి జరిగి నెల రోజులు దాటాక కూడా ఆమె పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న మెగా డాటర్.. కుటుంబ సభ్యులందరి సమక్షంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహమాడింది. ఈ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖులు సందడి చేయడంతో ఆయా వీడియోలు ఆన్‌లైన్ వేదికలను షేక్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన పెళ్లికి సంబంధించి ఫుల్ వీడియో అభిమానులతో పంచుకుంది నిహారిక. ఇప్పటిదాకా తన కూతురు నిహారిక నిహారిక పెళ్లి ముమేంట్స్‌ను నాగబాబు యూట్యూబ్ ఛానెల్ ద్వారా రివీల్ చేయగా.. తాజాగా నిహారిక తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి మూమెంట్ లోని కీలక ఘట్టాలను కట్ చేసి ఓకే ఒక్క వీడియో రూపంలో షేర్ చేసింది. ఈ వీడియోలో నిహారికకు పెళ్లి కూతురు చేస్తున్నప్పటి నుంచి ఆమె మెడలో చైతన్య తాళి కట్టే మూమెంట్, పెళ్లి వేడుకలో వరుణ్ తేజ్, నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఎంజాయింగ్ మూమెంట్స్ అన్నీ చూపించారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తాళి కట్టించుకుంటున్న శుభ గడియలో నిహారిక తీవ్ర భావోద్వేగానికి లోను కావడం చూడొచ్చు. అలాగే మెగా ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభించిన నాటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నిహారిక.. పెళ్లి కుమార్తెగా సిద్ధమవుతున్న సమయంలో కాబోయే భర్త చైతన్య పంపించిన ఓ సందేశంతో కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ''డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది'' అని పేర్కొన్నారు చైతన్య. కాబోయే వాడు ప్రేమగా చెప్పిన ఈ మాటలు విని ఆనందభాష్పాలు కార్చిన నిహారిక, చిరంజీవి డాటర్ సుస్మితను హత్తుకొని ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3sSP6P8
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.