
చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరాన్ని నేరుగా తాకలేదు.. ఆమె ఒంటిపై డ్రెస్ ఉంది.. బలవంతంగా అత్యాచార ప్రయత్నం జరగలేదు.. ఆమె ప్రైవేట్ భాగాలను ఉద్దేశపూర్వకంగా తాకలేదు కాబట్టి అది కిందకు రాదని.. మహిళలను అవమానకరంగా ప్రవర్తించడం కింద పరిగణించొచ్చని బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయమేంటంటే.. పన్నెండేళ్ల బాలికను ఇంటి సమీపంలో నివాసముంటున్న వ్యక్తి జామకాయ ఇస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. గదిలోకి తీసుకెళ్లి ఆమె ఛాతిపై తాకుతూ డ్రెస్ తీసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు పెట్టడంతో ఆమె నోరుమూసేశాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుమార్తె కేకలు విని తల్లి అక్కడికి వచ్చేలోపు ఇంటి బయట గడియ పెట్టి వెళ్లిపోయాడు. ఇంట్లోకి వెళ్లగా గది బయట గడియ పెట్టి ఉంది. తలుపు తీసి చూడడంతో కూతురు ఏడుస్తూ జరిగిన విషయం తల్లికి చెప్పింది. వెంటనే బాధితురాలిని వెంటబెట్టుకుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ‘పోక్సో చట్టం ప్రకారం నిందితుడు బాలికపై అత్యాచార యత్నం చేసి ఉండాలి. బాలిక ప్రైవేటు భాగాలను తాకడం లేదా ప్రైవేట్ పార్ట్స్‌లో ప్రవేశం చేసి ఉండాలి. పోక్సో కేసులో తీవ్రమైన ఆరోపణలు.. లేకుంటే బలమైన ఆధారాలు ఉండాలని జడ్జి వ్యాఖ్యానించారు. బాలిక డ్రెస్ పైనుంచి తాకడం పోక్సో కింద విచారణ చేపట్టేంత సీరియస్ విషయం కాదని.. ఒకవేళ డ్రెస్ లోపల చేయి పెట్టి నొక్కి ఉంటే సీరియస్‌గా పరిగిణించి పోక్సో చట్టం కింద విచారించవచ్చని న్యాయమూర్తి అన్నారు. డ్రెస్‌పై నుంచి శరీరాన్ని తాకడం పోక్సో చట్టం ప్రకారం నేరంగా భావించలేమని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి బలమైన ఆధారాలు లేకపోవడం.. పైనుంచి మాత్రమే శరీరాన్ని తాకడం వంటి ఘటనలను మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సెక్షన్ల కింద విచారణ జరపొచ్చని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడదే హాట్‌టాపిక్‌గా మారింది. బాంబే హైకోర్టు తీర్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాజం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి తీర్పులు ఇవ్వడం సరైంది కాదని పలువురు బహిరంగంగానే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన తాప్సీ, సింగర్ చిన్మయి లాంటి వారు ఈ చట్టం అద్భుతంగా ఉందని.. ఈ దేశం లైంగిక వేధింపులకు పాల్పడే వారి కోసమేనంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3c67I8l
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.