దక్షిణాదిలో సుప్రీం బెంచ్ డిమాండ్.. ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ తొలిసారి ఉమ్మడి తీర్మానం - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Monday, January 25, 2021

దక్షిణాదిలో సుప్రీం బెంచ్ డిమాండ్.. ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ తొలిసారి ఉమ్మడి తీర్మానం

దక్షిణాదిలో బెంచ్ ఏర్పాటుచేయాలని కోరుతూ ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు చెందిన బార్ కౌన్సిళ్లు సంయుక్తంగా ఆదివారం ఈ తీర్మానానికి ఆమోదం తెలిపాయి. ఏర్పాటుచేయాలని డిమాండ్ చాలా కాలంగా ఉన్నా.. ఐదు రాష్ట్రాల న్యాయ కోవిదులు సంయుక్తంగా తీర్మానం చేయడం ఇదే తొలిసారి. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో ఐదు రాష్ట్రాల బార్ అసోసియేషన్స్ అధ్యక్షులు ఈ అంశంపై చర్చించారు. ఈ కమిటీకి తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ నర్సింహారెడ్డిని కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. సుప్రీంకోర్టుకు చేరుకోలేక పోవడం, సుదూర ప్రయాణ ఖర్చులను భరించలేకపోవడం వల్ల అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచనను విరమించుకునే ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్ చేస్తున్నట్టు కమిటీ పేర్కొంది. సుప్రీంకోర్టు దక్షిణాది ధర్మాసనం ఏర్పాటుపై ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు కలిసి పోరాటం చేయనున్నాయి. ఐదు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని నాలుగు ప్రాంతాల్లోనూ అప్పిలేట్ బెంచ్‌లను సుప్రీంకోర్టు ఎందుకు ఏర్పాటుచేయలేదో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీలో ఉన్న ప్రధాన న్యాయస్థానం ప్రత్యేకంగా రాజ్యాంగ సంబంధిత సమస్యలపై దృష్టి కేంద్రీకరించగలదు.. నాలుగు హైకోర్టుల నుంచి వచ్చే అప్పీళ్లపై నిర్ణయం తీసుకుంటాయి’ అన్నారు. అప్పిలేట్ బెంచ్ ఏర్పాటు విషయమై రాబోయే రోజుల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, సుప్రీంకోర్టులోని ఇతర న్యాయమూర్తులను కలవనున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలో కోర్టు బెంచ్‌ను సత్వరమే ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బి.కొండారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు. ప్రధాన వక్తలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు బార్‌ కౌన్సిళ్ల చైర్మన్లు ఎ.నర్సింహారెడ్డి, జి.రామారావు, కేపీ జయచంద్రన్‌, పి.అమల్‌రాజ్‌ పాల్గొన్నారు


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3iKoyeA

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages