నెలకు రూ.16,000 స్టయిపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌.. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోండి - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Thursday, April 22, 2021

నెలకు రూ.16,000 స్టయిపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌.. డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోండి

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) - ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌-2021 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి. మరోక లింక్ కోసం ఇక్కడ .
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా ఉత్తీర్ణులు అర్హులు. నాయకత్వ లక్షణాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
  • వయసు: దరఖాస్తు నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఫెలోషిప్‌ ఖాళీలు: 100కు పైగా ఖాళీలున్నాయి.
  • ఫెలోషిప్‌ వ్యవధి: 13 నెలలు ఉంటుంది.
  • అంశం: రూరల్‌ డెవల్‌పమెంట్‌
స్టయిపెండ్‌:
  • నివాస ఖర్చుల కోసం నెలకు రూ.15,000
  • రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,000
  • అలవెన్సుల కింద రూ.50,000
  • మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.
  • ఎంపిక: ఈ ఫెలోషిప్‌లకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2021
  • వెబ్‌సైట్‌:


from Education News in Telugu: News on Board Exam Results, Job Notifications, University Results in Telugu https://ift.tt/3n9tbRq

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages