
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రత నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. కరోనాతో విలయతాండవానికి చిగురుటాకులా వణుకుతున్న ఛత్తీస్‌గఢ్‌లోని పలు జిల్లాల్లో మే 1 వరకు లాక్‌డౌన్ విధించారు. దీంతో గత ఏడాది తరహాలోనే పోలీసులు లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తూ ప్రజలు అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా చూస్తున్నారు. కోవిడ్ గురించి అవగాహన కల్పిస్తూ వైరస్ కట్టడికి సహకరించాలని కోరుతున్నారు. గతేడాది లాక్‌డౌన్ సమయంలో మాదిరిగానే ఛత్తీస్‌గఢ్ పోలీసులు అంకితభావంతో పని చేస్తున్నారు. దంతెవాడ జిల్లా డీఎస్పీ శిల్పా సాహూ ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ అయినప్పటికీ.. లాక్‌డౌన్ విధుల్లో పాల్గొని కోవిడ్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నారు. చేతిలో లాఠీ పట్టుకుని మండుటెండలో నిలబడి మరీ మహిళా అధికారి విధులు నిర్వర్తిస్తున్నారు. ‘‘విధి నిర్వహణ కోసం నేను బయటకొచ్చాను.. మీరు మాత్రం ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి’’ అని ఆమె ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వృత్తిపట్ల ఆమె అంకితభావం చూసి స్థానికులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో దంతేవాడ ఒకటి. మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాడే మహిళా కమాండోల బృందంలో ఉన్న డీఎస్పీ శిల్పా సాహు.. గర్భవతి కావడంతో ఆ విధుల నుంచి విరామం తీసుకుంది.. కానీ ఆమె ‘తన బాధ్యతల నుంచి విరామం తీసుకోలేదు’అని కొనియాడుతున్నారు. శిల్పా సాహుపై చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేలా ప్రశంసలు కురిపించారు. ‘‘మహమ్మారి ఈ క్లిష్ట సమయాల్లో ఒక ప్రేరణగా నిలిచారు... గర్భవతి అయినప్పటికీ, ఆమె వీధుల్లోకి వచ్చి కోవిడ్ లాక్‌డౌన్ మార్గదర్శకాలను సక్రమంగా అమలయ్యేలా పనిచేస్తోంది.. సమాజానికి ఓ ఉదాహరణగా నిలిచారు’’ అని ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్ర, యూపీ తర్వాత యాక్టివ్ కేసులు ఎక్కువగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. కోవిడ్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా రోజుకు వందకుపైగా ఉంటోంది. నెల రోజుల వ్యవధిలోనే ఇక్కడ 2.25 లక్షల కేసులు, 1993 మరణాలు సంభవించడంతో.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dDgafS
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.