
అజ్ఞాతవాసి సినిమా తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ 'వకీల్ సాబ్'గా తిరిగి రీ- ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందునుంచే ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు చిత్రానికి గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చాయి. ఈ మూవీలో లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటన భేష్ అనిపించుకోగా ప్రకాష్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల పర్‌ఫార్‌మెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో కలెక్షన్స్ వరద పారింది. అయితే తాజాగా ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్మ్యూనరేషన్స్ ఇవే అంటూ సినీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఫిలిం నగర్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 65 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. సినిమాలో నటించినందుకు గాను 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకున్న ఆయన మరో 15 కోట్ల రూపాయలు ఓ ఏరియా రైట్స్‌లో షేర్‌గా తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాలో లాయర్ కోటు వేసుకొని పవన్‌తో డీ కొట్టిన ప్రకాష్ రాజ్ కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. ఇక చిత్రంలో నటించిన నలుగురు హీరోయిన్స్ తీసుకున్న రెమ్మ్యూనరేషన్ కూడా ఇదే అంటూ జోరుగా టాక్ నడుస్తోంది. రోల్ చిన్నదే అయినా ఇమేజ్ దృష్ట్యా శృతి హాసన్‌కు 75 లక్షలు ఇచ్చారట. అలాగే నివేదా థామస్‌కు 75 లక్షలు, అంజలి 50 లక్షలు, అనన్యకు 25 లక్షలు పారితోషికంగా ముట్టజెప్పారని అంటున్నారు. ఇక థమన్ బాణీలకు కూడా భారీగానే రెమ్మ్యూనరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్‌గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'వకీల్ సాబ్' మూవీ ఏప్రిల్ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో కూడా ఈ రేంజ్‌లో వసూళ్లు రాబట్టడం పట్ల చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు ఇద్దరూ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా భారీ లాభం పొందారని తెలుస్తోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ek0IEw
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.