
జబర్దస్త్ వేదికపై కొన్ని జోడీలకు ఉండే డిమాండే వేరు. బుల్లితెరపై కూడా రొమాన్స్ చేసి మెప్పించగలం అని నిరూపించుకున్న జోడీలు చాలానే ఉన్నాయి. అందులో మొదటగా చెప్పుకోవాల్సిన జోడీ సుధీర్- రష్మీ. ఆ తర్వాత అదే రేంజ్ క్రేజ్ కొట్టేశారు వర్ష- . జబర్దస్త్ వేదికపై వీళ్ళు చేసే రొమాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటు అనసూయ, ఇటు రోజా చూస్తుండగానే రెచ్చిపోతుంటారు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినా తమ ముద్దుముచ్చటతో బుల్లితెర ఆడియన్స్‌కి పిచ్చెక్కిస్తుంటారు. అయితే ఇటీవలే ఇమ్మానుయేల్ జోడీ వర్ష కరోనా బారిన పడటంతో ప్రతి ఒక్కరి చూపు ఈ కమెడియన్ పైనే పడింది. తాను కోవిడ్ బారిన పడ్డానని, తనతో కాంటాక్ట్ అయిన వారంతా జాగ్రత పడాలని ఇటీవలే వర్ష స్వయంగా చెప్పడంతో.. జబర్దస్త్ యూనిట్ సంగతి అటుంచితే మరీ ముఖ్యంగా ఇమ్మానుయేల్ పరిస్థితి ఏంటి? అనే దానిపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. వర్షతో ఎప్పుడూ రాసుకుపూసుకు తిరిగే ఇమ్మానుయేల్‌కి కరోనా సోకిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన ఇమ్మానుయేల్ అసలు విషయం బయట పెట్టేశాడు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నెటిజన్లతో కాసేపు చిట్ చాట్ చేశారు ఇమ్మానుయేల్. దీంతో జనాల్లో ఉన్న అనుమానాలను ఆయన ముందు పెట్టేశాడు ఓ నెటిజన్. ‘టెస్టు చేయించుకో.. వర్షకు పాజిటివ్ అట' అని నేరుగా అనేశాడు. దీంతో ఆ మెసేజ్ చూసిన ఇమ్మానుయేల్ ప్రూఫ్‌తో సహా అసలు మ్యాటర్ అందరి ముందుంచాడు. మాటలతో కాకుండా ఏకంగా కోవిడ్ టెస్టు షేర్ చేశాడు. ఇందులో అతడికి నెగెటివ్ అని ఉంది. దీంతో అన్ని అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడింది. ఇకపోతే ఇమాన్యూయేల్‌తో పాటు వర్షతో పని చేస్తున్న ఆర్టిస్టులందరూ టెస్టులు చేయించుకున్నారని, వాళ్ళెవరికీ కోవిడ్ లేదని తెలుస్తోంది. మరోవైపు కరోనా బారినుంచి వర్ష త్వరగా బయటపడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3eF8rNN
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.