
యాంకరింగ్‌తో, తన అందచందాలతో వేలాది మంది అభిమానులను సంపాదించుకుంది అనసూయ. తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన కొంతకాలంలోనే స్టార్ యాంకర్ స్టేటస్‌ని సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో హవా మామూలుగా ఉండదు. కురుచ దుస్తులతో.. తన అందాలను చూపిస్తూ.. ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది ఆమె. ఇక పలు అంశాలపై ఆమె చేసే కామెంట్లు కూడా వివాదాస్పదం అవుతుంటాయి. దీనిపై నెటిజన్లు దురుసుగా స్పందిస్తుంటారు. ఆమెపై కామెంట్ల, సెటైర్లలు వేస్తుంటారు. అయితే చాలా వరకూ వాటిని పట్టించుకొని అనసూయ.. కొన్నిటిపై మాత్రం రియాక్ట్ అవుతుంది.. గట్టిగా కౌంటర్ ఇస్తుంది. మరోసారి అనసూయకు అలాంటి పరిస్థితే ఎదురైంది. తన తాజా ఫోటోషూట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలను అనసూయ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె ఆ పొట్టి గౌను వేసుకొని.. కొంటె లుక్స్‌తో ఆమె కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేసింది. దీని ‘నేను ఇంకా చిన్నపిల్లనే’ అంటూ క్యాప్షన్ కూడా జత చేసింది. దీనిపై ఓ నెటిజన్ ఘాటైన కామెంట్ పెట్టాడు. ఓవైపు కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంటే.. ఈ పరిస్థుల్లో మీరు ఇలాంటి ఫోటోలు పెట్టడం అవసరమా అంటూ కామెంట్ చేశాడు. ‘‘ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసే ముందు.. ప్రస్తుతంలో దేశ వ్యాప్తంగా పెరుగున్న కరోనా కేసుల గురించి.. మరణాల గురించి మీకు ఎలాంటి బాధ లేదా.. ఇలాంటి ఉపద్రవ పరిస్థితులల్లో ఇలాంటివి అవసరమా’’ అంటూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీనిపై అనుసూయ ధీటుగా కౌంటర్ ఇచ్చింది. ‘ఇలాంటి ఉపద్రవ పరిస్థితుల్లో కూడా మీకు కొంత వినోదాన్ని పంచాలనేదే మా ప్రయత్నం. అదే నా ఉద్ధేశ్యం..’ అంటూ అనసూయ రిప్లే ఇచ్చింది. దీనిపై సదరు నెటిజన్ కూడా మళ్లీ కౌంటర్ వేశాడు. ‘ఈ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది మీరిచ్చే వినోదం కాదు.. దాని ద్వారా వచ్చే నమ్మకం కాదు.. వాళ్లకి మద్దతు కావాలి’ అంటూ అతను కామెంట్ చేశాడు. మరి దీనిపై రంగమత్త ఏమని రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి మరి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gzkpe3
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.