
స్టైలిష్ స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు . లేటెస్ట్‌గా ఐకాన్‌స్టార్‌గా అప్‌డేట్ అయిన బన్నీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్, అద్భుతమైన డ్యాన్స్‌లతో ప్రేక్షకుల మనస్సు దోచుకున్నాడు. సినిమా.. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గత ఏడాది ‘అల వైకుంఠపుములో’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న బన్నీ.. త్వరలో ‘పుష్ప’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఒక అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎన్నో హిట్లతో పాటు.. ఎన్నో అరుదైన రికార్డులను సాధించాడు. తాజాగా మరో అరుదైన రికార్డు అల్లు అర్జున్ ఖాతాలో చేరింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో బన్నీ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరకెక్కిన కామెడీ కమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డీజే(దువ్వాడ జగన్నాధం). ఈ సినిమా కలెక్షన్ల పరంగా కాస్త నిరాశపరిచిన ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ సినిమా ఓ అరుదైన రికార్డును సాధించింది. ఇప్పటికే ఈ సినిమా హిందీ వర్షన్ యూట్యూబ్‌లో కొన్ని వందల మిలియన్ల వ్యూస్ అందుకుంది. తాజాగా తెలుగులో సింగిల్ ఛానెల్‌లో 100 మిలియన్ వ్యూస్ అందుకున్న సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ ఫీట్ సాధించిన తొలి సినిమాగా సూపర్‌స్టార్ నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఈ అరుదైన ఘనత ‘’ సినిమాకు దక్కింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3dISDu1
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.