
లోక్‌సభ మాజీ స్పీకర్ చనిపోయారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, ఆమె ప్రాణాలతోనే ఉన్నారని తెలియడంతో అందరూ నాలుక్కరుచుకున్నారు. ఈ నేపథ్యంలో తాను చనిపోయినట్లు వస్తున్న తప్పుడు వార్తలపై సుమిత్ర మహాజన్ శుక్రవారం స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తను మరణించానో లేదో అధికారికంగా నిర్ధారణ చేసుకోకుండా అంత తొందర ఏంటని ఆమె ప్రశ్నించారు. నా మరణం గురించి ఇండోర్ అధికారుల నుంచి సమాచారం తీసుకోకుండా చనిపోయినట్లు ఛానల్స్ ఎలా చెబుతాయని నిలదీశారు. నా మేనకోడలు థరూర్‌ను ట్విటర్‌లో ఖండించారు... కానీ ధ్రువీకరించకుండా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయితే, ఈ తప్పుడు వార్తలపై కేంద్రం, లోక్‌సభ స్పీకర్ విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరాారు. సుమిత్రా మహాజన్ చనిపోయారని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆమెకు సంతాపం ప్రకటించి, ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. అయితే సుమిత్ర ఇంకా బతికే ఉందని, ఆరోగ్యంగా ఉన్నారని ఆమె మేనకోడలు, బీజేపీ నేతలు వెల్లడించడంతో వెంటనే శశిథరూర్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. తన తొందరపాటుకు ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనతోపాటు కొన్ని మీడియా ఛానళ్లు సైతం తప్పుగా ప్రసారం చేశాయి. అయితే నిజం తెలిశాక ఆమె చనిపోలేదని మళ్లీ వార్తలు ప్రచురించాయి. సుమిత్రా మహజన్ కుమారుడు మందర్ సైతం తన తల్లి ఆరోగ్యంపై ఓ వీడియో పెట్టారు. తన తల్లి బాగానే ఉందని, ఆమె గురించి వస్తున్న తప్పుడు వార్తలకు నమ్మవద్దని ప్రజలను కోరారు. మాజీ స్పీకర్ అనారోగ్యంతో ఇండోర్ ఆస్పత్రిలో చేరడంతో మీడియా అత్యూత్సాహం ప్రదర్శించి ఆమె చనిపోయినట్టు వార్తలు ప్రచురించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QU1hwz
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.