
డబ్బింగ్ ఆర్టిస్టుగా అదేవిధంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడే యువతిగా మనందరికీ తెలుసు . మీటూ, క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసిన ఆమె.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మహిళలపై జరుగుతున్న షాకింగ్ ఘటనలు, అత్యాచారాల గురించి స్పందిస్తూ ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా హాట్ టాపిక్ అయిన ఫన్ బకెట్ భార్గవ్ ఇష్యూపై రియాక్ట్ అయిన చిన్మయి.. మరోసారి ఇదే అంశంపై మాట్లాడుతూ సమాజ పరిస్థితులపై మండిపడింది. టిక్‌టాక్ వీడియోల పేరుతో 14 ఏళ్ల మైనర్ బాలికపై భార్గవ్ అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు విశాఖ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం, సదరు మైనర్ గర్ల్ గర్భవతి అని తెలియడం సంచలనంగా మారింది. దీంతో ఓ మీడియా రాసిన వార్తపై స్ట్రాంగ్ కౌంటర్ వేస్తూ నిన్న (గురువారం) ఓ వీడియో పోస్ట్ చేసిన చిన్మయి.. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసింది. ఇందులో సమాజ తీరుపై రియాక్ట్ అవుతూ అందరిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కోరింది. ''నిన్న ఒక లైవ్ వీడియో పెట్టడంతో కొంతమంది మహిళలు కూడా ఫోన్ చేసి భార్గవ్ ఇష్యూ గురించి అడుగుతున్నారు. అది ఇద్దరి మధ్య సమ్మతితో జరిగిన సంఘటన కానీ రేప్ ఎలా అవుతుందని అంటున్నారు. అడల్ట్ అయిన ఓ వ్యక్తి మైనర్ వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవడం అనేది రేప్ అనే అనబడుతుంది. ఒక మైనర్ నీపై ఇష్టం ఉందని చెప్పినా హద్దుల్లో ఉండటం అనేది అడల్ట్స్ బాధ్యత. అంతేకానీ వాళ్ళతో కమిటై లైంగికంగా కలిశారంటే అది రేప్ అవుతుంది. ఈ ఇష్యూలో టిక్ టాక్ భార్గవ్ ఏజ్ 27. ఆ అమ్మాయి ఏజ్ 14. అతనికి తెలియదా ఒక మైనర్ అమ్మాయితో ఇలాంటి సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవద్దని. ఎవరో ఇడియట్స్ దీన్ని సమ్మతితో కూడిన రిలేషన్ అంటున్నారు కానీ అది తప్పు. 18 ఏళ్ల లోపు వారిని టచ్ చేస్తే అది లైంగిక దాడి కిందే వస్తుంది. ఒకవేళ మైనర్ సెక్సువల్ రిలేషన్ కావాలన్నా.. వద్దని చెప్పే బాధ్యత అడల్ట్‌కే ఉంటుంది. ఇదే నిజమైన లా. దయచేసి అర్థం చేసుకోండి'' అని చిన్మయి ఈ వీడియోలో పేర్కొంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ayHGJD
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.