అలాంటి సమయంలో ఆ విధంగా పడుకుంటాం.. సీక్రెట్ బయటపెట్టేసిన నిహారిక - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Friday, April 23, 2021

అలాంటి సమయంలో ఆ విధంగా పడుకుంటాం.. సీక్రెట్ బయటపెట్టేసిన నిహారిక

మెగా డాటర్ సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెళ్లి తరువాత నిహారిక ఎక్కువగా పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తన భర్త చైతన్యకు సంబంధించిన విషయాలెన్నో షేర్ చేస్తూ వస్తున్నారు. తన బర్త్ డే సందర్బంగా భర్త ఇచ్చిన సర్ ప్రైజ్ గిఫ్ట్ గురించి చెబుతూ నిహారిక షేర్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మెగా ఇంట్లో ఎక్కువగా అందరూ మూగ జీవాలను ఇష్టపడుతుంటారు. రామ్ చరణ్ ఉపాసనలు మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఫాం హౌస్‌ను కట్టేశారు. ఇక నాగబాబు ఇంట్లో రెండు మూడు పెట్స్ ఉన్నాయి. పీకూ అంటూ నాగబాబు ఎప్పుడూ తన పెట్ గురించి చెబుతూ ఉంటారు. ఇక నిహారికకు కూడా పెట్స్ అంటే ఎంతో ఇష్టం. నిహారిక కోసం ఓ స్పెషల్ బ్రీడ్ పెట్‌ను తీసుకొచ్చారు. పెళ్లి తరువాత వచ్చిన మొదటి బర్త్ డే అని నిహారిక భర్త చైతన్య బజ్ అనే కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చేశారు. బజ్‌ను వారు తమ సంతానంగా పెంచుకుంటున్నారు. బజ్ బాబు అంటూ నిహారిక పెట్ గురించి షేర్ చేసే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలా చైతన్య, నిహారికలు బజ్‌తో ఆడుకునే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. అలా నిహారిక బర్త్ డే సందర్భంగా బజ్ వాళ్లింట్లోకి చేరింది. అయితే తాజాగా నిహారిక ఓ సీక్రెట్ బయటపెట్టేశారు. బజ్‌కు తనకూ ఉన్న సంబంధం గురించి అనుబంధం గురించి తెలిపేలా ఓ పోస్ట్ చేశారు. తనకు ఒంట్లో బాగా లేకపోయినా, మూడ్ సరిగ్గా లేకపోయినా, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా బజ్, తాను చేతిలో చేయి వేసి పడుకుంటామని నిహారిక అసలు విషయం చెప్పేశారు. ఆ ఇద్దరి బంధం అంటే తనకు ఎంతో ఇష్టమని చైతన్య కూడా చెప్పుకొచ్చారు. నిహారిక చైతన్యకు గత ఏడాది డిసెంబర్ 9న రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా వివాహాం జరిగిన విషయం తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nfJdt5

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages