తినడానికి తిండిలేని ధీనస్థితి.. వాటిని గుర్తు చేసుకుని శేఖర్ మాస్టర్ కంటతడి.. రోజుకు ఎంత ఇచ్చేవారంటే? - Trending Telugu News Headlines Today- Best Telugu News

Breaking

Thursday, April 22, 2021

తినడానికి తిండిలేని ధీనస్థితి.. వాటిని గుర్తు చేసుకుని శేఖర్ మాస్టర్ కంటతడి.. రోజుకు ఎంత ఇచ్చేవారంటే?

సినిమా అనేది రంగులప్రపంచం. అక్కడ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కష్టాలు, బాధలు, సంతోషాలు, సుఖాలు, లాభనష్టాలు అన్నీ ఉంటాయి. అయితే కెరీర్ ప్రారంభ దశలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని అక్కడే స్టార్స్‌గా ఎంతో మంది ఎదిగారు. ఛీ కొట్టిన వారితోనే సలాంలు పెట్టించుకున్న వారు కూడా ఉన్నారు. అలా తన కెరీర్ ప్రారంభదశలో పడిన కష్టాలను చెబుతూ అందరినీ ఏడిపించేశారు. శేఖర్ మాస్టర్ అంటే ఒకప్పుడు కేవలం కొరియోగ్రఫర్‌గానే చూసేవారు. కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఓ స్టార్. పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేస్తున్నారు. అలా రెండు చోట్లా శేఖర్ మాస్టర్ తన హవా చూపిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. షో నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకున్నాడనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా శేఖర్ మాస్టర్ ఢీ షోలో కనిపించడం లేదు. అయితే ఏదో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి రావడం లేదని మొదట్లో అనుకున్నారు. కానీ అదే సమయంలో అనే షోలో జడ్జ్‌గా కనిపించసాగారు. అక్కడ కనిపించి ఇక్కడ కనిపించకపోవడం జనాలు అందరూ కూడా గుసగుసలు ఆడటం మొదలుపెట్టేశారు. ఢీ నుంచి శేఖర్ మాస్టర్ తప్పుకున్నాడని, మల్లెమాలతో గొడవలు జరిగి ఉంటాయని అందుకే వెళ్లిపోయారని కామెంట్లు వచ్చాయి. ప్రస్తుతం శేఖర్ మాస్టర్ కామెడీ స్టార్స్ షోలో న్యాయ నిర్ణేతగా ఉన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది. అందులో అవినాష్ టీం ఓ స్కిట్ వేసింది. ఆ స్కిట్‌ను చూడటం శేఖర్ మాస్టర్ తన గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. జూనియర్ ఆర్టిస్ట్‌గా ఉన్న రోజుల్లో పట్టెడన్నం కోసం పడిన పాట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. 75 రూపాయలు ఇస్తే ఎంతో గొప్పగా ఫీలయ్యాను.. అన్నం కూడా దొరకని స్థితిలో ఉండేవాడిని అని చెబుతూ కన్నీరు పెట్టేసుకున్నారు. శేఖర్ మాస్టర్ చెప్పిన విషయాలు విని అందరూ ఎమోషనల్ అయ్యారు. కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ లెవెల్ వేరు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతోన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32J2kC9

No comments:

Post a Comment

If you have any doubts, please let us know.

Pages