
ఓ వైపు కరోనా విలయతాండవం మరోవైపు టాలీవుడ్‌లో చోటు చేసుకుంటున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కారణంగా కొందరు సినీ ప్రముఖులు దూరమవుతుండగా అనారోగ్య కారణాలతో ఇంకొంతమంది కన్నుమూస్తున్నారు. నాగార్జున హీరోగా నటించిన 'సంకీర్తన' మూవీ నిర్మాతగా వ్యవహరించిన డాక్టర్ యం. గంగయ్య మరణించారనే వార్త టాలీవుడ్‌లో విషాదం నింపింది. నిన్న (బుధవారం) ఆయన రాజమండ్రిలో యం. గంగయ్య మరణించారు. అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున, రమ్యకృష్ణ జంటగా రూపొందిన 'సంకీర్తన' సినిమాను ఆయన నిర్మించారు. ఈ సినిమాతో గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం కాగా ఇళయరాజా సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xdfd5D
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.