
బాహుబలి లాంటి భారీ రేంజ్ మూవీ తర్వాత మళ్ళీ అదే రేంజ్‌లో సినిమా చేస్తున్నారు దర్శకధీరుడు రాజమౌళి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మూవీ అనౌన్స్ అయ్యిందో అప్పటినుంచే భారీ హైప్ క్రియేట్ అయి షూటింగ్ దశలోనే పలు రికార్డులు చెరిపేస్తోంది RRR. ఈ నేపథ్యంలోనే తాజాగా టీజర్ ఓ అరుదైన ఫీట్ అందుకుంది. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రుపోనిదిస్తున్న ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. కాగా గతేడాది మార్చి నెలలో విడుదలైన రామ్ చరణ్ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో యూట్యూబ్‌లో దుమ్ముదులపగా.. దసరా కానుకగా విడుదలైన ఎన్టీఆర్ 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఆన్‌లైన్ సెన్సేషన్ అయింది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్ విశ్వరూపం కనిపించింది. దీంతో ఇప్పటికే పలు రికార్డ్స్ క్రియేట్ చేసి నందమూరి ఫ్యాన్స్‌ని హుషారెత్తించిన ఈ మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ కొమురం భీమ్ టీజర్‌ను రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదల చేసి ఇటు మెగా అభిమానులను, అటు నందమూరి అభిమానులను ఖుషీ చేశారు జక్కన్న. దీంతో విడుదలైన రోజే స్పీడ్ పెంచేసి ఇప్పటికి యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన మొట్టమొదటి తెలుగు టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. ఎలాంటి ప్రమోషన్స్, ట్వీట్స్ సపోర్ట్ లేకుండా ఒక్క యూట్యూబ్ ద్వారానే ఈ రేంజ్ వ్యూస్ రాబట్టడం ఎన్టీఆర్ స్టామినాను బయటపెట్టింది. ఈ మూవీ రిలీజ్ కోసం జనం కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3tNwKPC
No comments:
Post a Comment
If you have any doubts, please let us know.